Abhiram: 'అహింస' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు!

  • అభిరామ్ హీరోగా రూపొందిన 'అహింస'
  • తేజ నుంచి వస్తున్న మరో ప్రేమకథ 
  • ఈ సినిమాతో ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ 
  • జూన్ 2వ తేదీన సినిమా విడుదల  
Ahimsa Pre Release  Event Date Confirmed

తేజ దర్శకత్వంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అహింస' రెడీ అవుతోంది. ఆనంది ఆర్ట్స్ - సురేశ్ ప్రొడక్షన్స్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రానా తమ్ముడు అభిరామ్ ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఇక కథానాయిక గీతికకు కూడా ఇదే మొదటి సినిమా. జూన్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ - చీరాలలోని NRPM హైస్కూల్ గ్రౌండ్ లో ఈ నెల 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 6:30 నిమిషాల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు. 

ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. సదా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ. ఇంతవరకూ వదలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రేమకథా చిత్రంతో అభిరామ్ ఫస్టు హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఈ సినిమా తరువాత తేజ సినిమా రానాతో ఉన్న సంగతి తెలిసిందే. 

More Telugu News