Budda Venkanna: సీబీఐ అధికారులపై దాడికి కుట్రలు చేస్తున్నారు: బుద్దా వెంకన్న

YS Avinash Reddy playing dramas says Budda Venkanna
  • వివేకా హత్య కేసులో అవినాశ్ పాత్రధారి, జగన్ సూత్రధారి అన్న బుద్దా
  • తల్లిని అడ్డం పెట్టుకుని అవినాశ్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శ
  • కర్నూలు ఆసుపత్రి వద్దకు కడప రౌడీలను ఎందుకు తరలించారని ప్రశ్న
వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యకు సంబంధించి వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్రధారి, ముఖ్యమంత్రి జగన్ సూత్రధారి అని ఆరోపించారు. దైవం లాంటి కన్నతల్లిని అడ్డం పెట్టుకుని అవినాశ్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సీబీఐ అధికారులకు ఏపీ పోలీసులు సహకరించకపోవడం దారుణమని... ఇతర రాష్ట్రాల పోలీసులను తీసుకొచ్చయినా సరే అవినాశ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

కర్నూలు ఆసుపత్రి వద్దకు కడప రౌడీలను, అవినాశ్ అనుచరులను ఎందుకు తరలించారని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అవినాశ్ ను అరెస్ట్ చేస్తారనే భయంతోనే వీరిని అక్కడకు తరలించారని ఎద్దేవా చేశారు. ఒకవేళ అవినాశ్ ను అరెస్ట్ చేస్తే... సీబీఐ అధికారులపై వీరితో దాడి చేయించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కాసేపట్లో విచారణ జరపనుంది.
Budda Venkanna
Telugudesam
YS Avinash Reddy
Jagan
YSRCP

More Telugu News