Aanasuya: వేశ్య పాత్రలో కనిపించనున్న అనసూయ!

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'విమానం'
  • తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ 
  • అనసూయ ట్రాక్ ఈ సినిమాకి హైలైట్ అంటూ టాక్ 
  • జూన్ 9వ తేదీన సినిమా విడుదల   
Vimanam Movie Update

అనసూయ ఈ మధ్య కాలంలో సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. 'రంగస్థలం' .. 'పుష్ప' సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో 'విమానం' అనే సినిమాలోను ఆమె ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇది తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో నడిచే కథ. ఈ సినిమాలో సుమతి పాత్రలో అనసూయ కనిపించనుంది.

ఆమె పోషించిన సుమతి పాత్ర ఎలా ఉండనుంది? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో వదిలిన పోస్టర్స్ లో ఆమె హాట్ లుక్స్ తో కనిపించింది. ఆమె పోషించిన 'సుమతి' పాత్రను కూడా మొదటి నుంచి హైలైట్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరుతో ఒక సాంగ్ ను పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ పాటలోను ఆమె హాట్ హాట్ గానే కనిపించింది. 

ఆమె పాత్ర వైపు నుంచి ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ ను బట్టి చూస్తే, వేశ్యగా ఆమె కనిపించనుందనే విషయం అర్థమవుతోంది. రాహుల్ రామకృష్ణ కాంబినేషన్లోని ఆమె సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఆమె కెరియర్లో ఈ పాత్ర కూడా ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందని అంటున్నారు. శివప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 9వ తేదీన విడుదల కానుంది.

More Telugu News