Naveen Ul Haq: నవీనుల్ హక్, యశ్ ఠాకూర్ సూపర్ బౌలింగ్... ముంబయి 182-8

Naveen Ul Haq and Yash Thakur rattles Mumbai Indians lineup
  • చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్
  • లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబయి ఇండియన్స్ ఢీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి
  • 4 వికెట్లు తీసిన నవీనుల్ హక్... 3 వికెట్లతో రాణించి యశ్ ఠాకూర్
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. 

లక్నో సూపర్ జెయింట్స్ పేసర్లు నవీనుల్ హక్, యశ్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబయి ఇండియన్స్ లైనప్ ను కట్టడి చేశారు. నవీనుల్ హక్ 4, యశ్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరూ తమ పేస్ తో ముంబయి బ్యాటింగ్ లైనప్ ను క్రీజులో కుదురుకోనివ్వలేదు. 

ముంబయి బ్యాట్స్ మన్లలో కామెరాన్ గ్రీన్ 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 33, తిలక్ వర్మ 26, నేహాల్ వధేరా 23 పరుగులు చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ 11, ఇషాన్ కిషన్ 15 పరుగులకే అవుటవడంతో ముంబయికి శుభారంభం లభించలేదు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో ముంబయి ఇండియన్స్ స్కోరు 200కి లోపే నమోదైంది.
Naveen Ul Haq
Yash Thakur
LSG
Mumbai Indians
Eliminator
IPL

More Telugu News