Priyanka Chopra: కెరీర్ ఆరంభంలో ఓ డైరెక్టర్ దారుణంగా ప్రవర్తించాడు: ప్రియాంక చోప్రా

Priyanka Chopra recalls dehumanizing moments in her early career
  • 2002-03 నాటి ఘటనను వివరించిన ప్రియాంక
  • ఓ సీన్ లో తాను కొద్దిగా దుస్తులు తొలగించాల్సి ఉంటుందని వివరణ
  • కానీ డైరెక్టర్ తన అండర్ వేర్ చూడాలని ఉందని వ్యాఖ్యానించాడని వెల్లడి
అంతర్జాతీయ తారగా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నటి ప్రియాంక చోప్రా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. ఓ సినిమా కోసం సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో దర్శకుడు నా అండర్ వేర్ చూడాలని ఉందని చెప్పాడు అని వెల్లడించింది. ఏ సందర్భంలో అతడు ఆ మాట అన్నాడో కూడా ప్రియాంక చోప్రా వివరించింది. 

"ఇది 2002-03 నాటి ఘటన. ఆ సినిమాలో నేను ఒక అండర్ కవర్ ఏజెంట్ ని. శృంగారపరంగా ఓ వ్యక్తిని రెచ్చగొట్టేలా నటించాలి. ఆ సీన్ లో నేను శరీరంపై కొద్ది మేర దుస్తులు తొలగించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ డైరెక్టర్ వచ్చి... నో... నేను ఆమె అండర్ వేర్ చూడాలని అనుకుంటున్నాను... ఇలాంటివి లేకపోతే ఈ సినిమా చూడ్డానికి ఎవరొస్తారు? అన్నాడు. దాంతో దిగ్భ్రాంతికి గురయ్యాను. నా కెరీర్ లో ఇదొక అమానవీయ ఘటన" అంటూ ప్రియాంక చోప్రా వివరించింది. 

ప్రియాంక చోప్రా ఇటీవల సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. గత నెలలో ఓటీటీ వేదికపై ఇచ్చిన ఈ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Priyanka Chopra
Career
Director
Actress
Bollywood
Hollywood

More Telugu News