Sukhesh Chandra Sekhar: కేజ్రీవాల్, కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేసిన సుఖేశ్ చంద్రశేఖర్

Sukhesh Chandra Sekhar comments on Kejriwal and Kavitha
  • కేజ్రీవాల్ ఇంటి ఫర్నిచర్ కు అయిన ఖర్చును తానే భరించానన్న సుఖేశ్
  • కవిత షెల్ కంపెనీల నుంచి నగదు బదిలీ అయిందని వెల్లడి
  • కేజ్రీవాల్ మరో కుంభకోణాన్ని బయటపెడతానని వ్యాఖ్య
మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారు. లేఖలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఇంటి ఫర్నిచర్ కు అయిన ఖర్చును తానే భరించానని తెలిపారు. దానికి సంబంధించిన బిల్లులు తన వద్ద ఉన్నాయని చెప్పారు. 

కవిత షెల్ కంపెనీల నుంచి మారిషస్ లోని కైలాశ్ గెహ్లాట్ బంధువుల అకౌంట్లకు నగదు బదిలీ అయిందని తెలిపారు. 25 - 25 - 30 కోట్ల నగదు బదిలీ అయిందని చెప్పారు. వాస్తవాలను బయటపెడుతున్నందుకు తనను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. త్వరలోనే కేజ్రీవాల్ కు సంబంధించిన మరో కుంభకోణాన్ని బయటపెడతానని చెప్పారు.

Sukhesh Chandra Sekhar
K Kavitha
BRS
Arvind Kejriwal
AAP

More Telugu News