Urvashi Rautela: ఏంటీ.. ఊర్వశి రౌతేలా నెక్లెస్ అన్ని కోట్లా?

Urvashi Rautelas team claims crocodile necklace is really worth Rs 276 crore after she gets trolled for wearing it
  • కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏ లో ఊర్వశి రౌతేలా మెరుపులు
  • ఆమె ధరించిన ‘మొసలి నెక్లెస్’పై సోషల్ మీడియాలో చర్చ
  • నెక్లెస్ నకిలీదంటూ ట్రోల్ చేసిన నెటిజన్లు
  • నెక్లెస్ విలువ రూ.276 కోట్లని వెల్లడించిన ఊర్వశి టీమ్ 
76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏.. ఫ్రాన్స్‏లో అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో హల్ చల్ చేస్తోంది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. రోజుకో వెరైటీ డ్రస్సులతో అందరినీ ఆకర్షిస్తోంది. మొన్న వేసుకున్న పింక్ టల్లే గౌనులో అద్భుతంగా కనిపించింది. మెడలో ‘మొసలి నెక్లెస్’, చెవులకు ‘మొసలి రింగులు’ పెట్టుకుంది. దీంతో ఆమె ధరించిన ఆభరణాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 

ఇదే సమయంలో ఆమెను సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఊర్వశి ధరించిన మొసలి నెక్లెస్ నకిలీదని కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఊర్వశి పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆమె ధరించిన నెక్లెస్ విలువ రూ.276 కోట్లు. అది ఆమె ఫ్యాషన్ అభిరుచిని తెలుపుతుంది. ఆ మొసలి నెక్లెస్ విలువ రూ.200 కోట్ల నుంచి రూ.276 కోట్లకు పెరిగింది’’ అని చెప్పుకొచ్చింది. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, విజయాలు.. రెండింటికీ ఈ నెక్లెస్ చిహ్నమని తెలిపింది.

ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏ లో బాలీవుడ్ నటీమణులు సందడి చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, సారా అలీ ఖాన్, మానుషీ చిల్లార్, ఇషా గుప్తా తదితరులు రెడ్ కార్పెట్ పై హొయలొలికించారు. విభిన్న దుస్తులతో ఫొటోలకు పోజులిచ్చారు.
Urvashi Rautela
crocodile necklace
crocodile rings
crocodile necklace worth Rs 276 crore
cannes film festival

More Telugu News