RCB: బెంగళూరు ఓటమిపై కోహ్లీ భావోద్వేగం

  • నిరాశ చెందినా తల ఎత్తుకునే ఉండాలన్న కోహ్లీ 
  • మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన విరాట్ 
  • సత్తాతో తిరిగొస్తామని వ్యాఖ్య 
Disappointed but we must hold Virat Kohli breaks silence after RCB heartbreaking exit in IPL 2023

విరాట్ కోహ్లీ.. తాను ప్రాతినిధ్యం వహించే జట్టుకు వీరాభిమానిగా, వీర విధేయుడిగా ఉంటాడు. టీమిండియా అయినా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అయినా సరే. ఐపీఎల్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుతోనే కొనసాగుతున్న కోహ్లీకి, ఆ ఫ్రాంచైజీ అంటే ప్రాణం. ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పు గెలుచుకోలేకపోయిన బెంగళూరుకు.. ఆ స్వప్పం ఈ సీజన్ లో అయినా నెరవేరుతుందని అనుకుంటే నిరాశే ఎదురైంది. కనీసం ప్లే ఆఫ్ కు కూడా చేరుకోలేదు. దీంతో విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. సానుకూల దృక్పథంతో స్పందించాడు.

‘‘లక్ష్యానికి చేరుకోలేకపోయాం. నిరాశ చెందినా, మనం తల ఎత్తుకునే ఉండాలి. ప్రతి అడుగులోనూ మాకు మద్దతుగా నిలుస్తున్న మా అభిమానులు అందరికీ ధన్యవాదాలు’’ అంటూ కోహ్లీ తన ట్విట్టర్ పేజీలో పేర్కొన్నాడు. అటు ఇన్ స్టా గ్రామ్ లోనూ ఆర్సీబీ స్క్వాడ్ గ్రూప్ ఫొటోను షేర్ చేశాడు. ఇదే సందేశాన్ని పేర్కొంటూ.. కోచ్ లు, మేనేజ్ మెంట్, జట్టు సభ్యులకు బిగ్ థాంక్యూ అని చెప్పాడు. సత్తాతో తిరిగొస్తామని ప్రకటించాడు. ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శనే ఇచ్చినా, ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరుకోలేకపోయింది. దీనికి కారణాలేంటో ఆ జట్టు కెప్టెన్ డూప్లెసిస్ మీడియాతో పంచుకోవడం తెలిసిందే. 

More Telugu News