Rahul Gandhi: ట్రక్ డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ఏం చేశారంటే..!

  • రాత్రిపూట ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ 
  • ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళుతుండగా అంబాలా దగ్గర ఆగిన కాంగ్రెస్ మాజీ చీఫ్
  • ట్రక్ డ్రైవర్లతో మాటామంతీ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi night out in a truck to discuss drivers issues

హెవీ వెహికల్ డ్రైవర్లు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఓ ట్రక్కులో ప్రయాణించారు. సోమవారం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి చండీగఢ్ బయలుదేరారు. ఈ క్రమంలో అంబాలా దగ్గర తన కారును ఆపి ట్రక్కు డ్రైవర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రిపూట ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ ఓ ట్రక్కు ఎక్కారు. ట్రక్కులో రాహుల్ గాంధీ ప్రయాణించడం చూసి హైవేపైన వెళుతున్న మిగతా వాహనాలలోని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారులో ప్రయాణిస్తున్న కొంతమంది దీనిని రికార్డు చేసి ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వీడియో వైరల్ గా మారింది.

కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రక్ డ్రైవర్లు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే రాహుల్ గాంధీ ఇలా ప్రయాణం చేశారని వారు చెబుతున్నారు. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే ఇలాంటి పనిచేయగలరని, పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని ఆయన తపన పడుతుంటారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి వ్యాఖ్యానించారు. కాగా, షిమ్లాలో ఉంటున్న తన సోదరి ప్రియాంక గాంధీ కుటుంబాన్ని కలుసుకునేందుకే రాహుల్ గాంధీ ఈ ప్రయాణం పెట్టుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News