Dimple Hayati: జూబ్లీహిల్స్ లో ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టి రచ్చ చేసిన హీరోయిన్ డింపుల్ హయతి.. కేసు నమోదు

  • జూబ్లీహిల్స్ లో ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్న డింపుల్, రాహుల్ హెగ్డే
  • డింపుల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన రాహుల్ డ్రైవర్
  • ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ అధికారిని దుర్భాషలాడటం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు
Case filed against Dimple Hayati for ramming her car into IPS officers car

సినీ హీరోయిన్, ఐటెం గర్ల్ డింపుల్ హయతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును ఆమె తన కారుతో ఢీకొట్టింది. ఆ తర్వాత రచ్చ చేస్తూ ఐపీఎస్ అధికారి ప్రభుత్వ వాహనాన్ని కాలుతో తన్నింది. రాహుల్ హెగ్డే ప్రస్తుతం ట్రాఫిక్ డీసీపీగా ఉంటున్నారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని ఎస్కేఆర్ అపార్ట్ మెంట్స్ లో చోటు చేసుకుంది. ఇక్కడ డింపుల్ హయతితో పాటు రాహుల్ హెగ్డే కూడా ఉంటున్నారు. 

ఈ ఘటనపై రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై పోలీసులు సెక్షన్ 341, 279, 353 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా ప్రభుత్వ వాహనాన్ని (ఆస్తి) ధ్వంసం చేయడం, ప్రభుత్వ అధికారిని దుర్భాషలాడటం వంటి అభియోగాలను ఆమెపై మోపారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాలంటూ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. మరోవైపు ఈ అంశంపై రాహుల్ హెగ్డే మాట్లాడుతూ... డింపుల్ హయతి తొలి నుంచి కూడా ఇలాగే వ్యవహరిస్తోందని చెప్పారు. తాను పలుమార్లు నచ్చచెప్పినా ఆమె పద్ధతి మార్చుకోలేదని అన్నారు.

More Telugu News