Sharath Babu: నేను చూసిన శరత్ బాబులో నాకు కనిపించినవి ఇవే: పోసాని

  • అనారోగ్యంతో కన్నుమూసిన శరత్ బాబు 
  • ఇండస్ట్రీ ప్రముఖుల నివాళి
  • శరత్ బాబు అందగాడు .. గుణవంతుడన్న పోసాని 
  • ఆయన మాట తీరు .. మర్యాద ప్రత్యేకమని వెల్లడి

Sharath Babu Special

ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు అనారోగ్య కారణాల వలన కన్ను మూశారు. ఇండస్ట్రీ ప్రముఖులంతా ఆయనతో తమకి గల అనుబంధాన్ని గురించి తలచుకుంటున్నారు. శరత్ బాబు గురించి పోసాని మాట్లాడుతూ .. "శరత్ బాబుగారు నాకు 1973 నుంచి తెలుసు. అప్పటికి నేను చాలా చిన్నవాడిని. 'కన్నెవయసు' హీరో లక్ష్మీకాంత్ ఊరు ... మా ఊరే. ఆయనను చూడటానికి వెళ్లినప్పుడు, ఆ సినిమాలో చేసిన శరత్ బాబు అక్కడే ఉన్నారు. 

అలా శరత్ బాబుగారిని మా ఊళ్లోనే మొదటిసారిగా చూశాను. మద్రాసులో నేను పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు శరత్ బాబుగారిని మళ్లీ చూశాను. ఆయన చాలా కలర్ .. చాలా హైటు .. నేనే తలెత్తి ఆయనను చూసేవాడిని. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా కనిపించేవారు. ఆరడుగుల పైన ఉన్నప్పటికీ ఆయన గంభీరంగా ఉండటం నేను చూడలేదు. ఫేస్ చిన్నపిల్లాడి ఫేస్ లా ఉండేది" అన్నారు. 

"శరత్ బాబు గారు ఏ పాత్రనైనా గొప్పగా పండిస్తారు. ఆయన విలన్ వేషాలు వేస్తే నాకు నచ్చేది కాదు .. ఎందుకంటే ఆయన స్వభావానికి అవి సెట్ కావు అనుకునేవాడిని. కొన్ని పాత్రలను చూస్తే అవి ఆయన మాత్రమే చేయగలరు అనిపిస్తుంది. మంచి ఫిజిక్ మాత్రమే కాదు .. మంచి గుణం ఉన్నవారు శరత్ బాబు. ఆయనను ఒకసారి చూస్తే ఆ రూపాన్ని ఎవరూ అంత తొందరగా మరిచిపోలేరు. ఆయన లేని లేటు ఎవరూ తీర్చలేనిది" అంటూ నివాళులర్పించారు.

More Telugu News