Narendra Modi: శరత్ బాబు విలక్షణ నటుడు: ప్రధాని నరేంద్ర మోదీ

Modi offers condolences over actor Sarath Babu demise
  • సినీ నటుడు శరత్ బాబు కన్నుమూత
  • సంతాపం తెలియజేసిన ప్రధాని మోదీ
  • తన నటనతో శరత్ బాబు ఎప్పటికీ గుర్తుండిపోతారని కితాబు
  • శరత్ బాబు మృతి విచారకరం అని వ్యాఖ్య 
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. శరత్ బాబు గారు విలక్షణమైన, సృజనాత్మక నటుడు అని కొనియాడారు. తన సుదీర్ఘ సినీ జీవితంలో అనేక భాషల్లో, అనేక పాత్రలతో ఎప్పటికీ గుర్తుండిపోతారని కీర్తించారు. శరత్ బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం విచారకరం అని మోదీ పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నానని వెల్లడించారు. 

కాగా, అభిమానుల సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని హైదరాబాదులోని ఫిలిం చాంబర్ వద్దకు తీసుకువచ్చారు. శరత్ బాబు భౌతికకాయానికి ఫిలిం చాంబర్ సభ్యులు, 'మా' ప్రతినిధులు నివాళులు అర్పించారు.
Narendra Modi
Sarath Babu
Demise
Condolences
Tollywood

More Telugu News