YS Avinash Reddy: బ్రేకింగ్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్ అవినాశ్ రెడ్డి

YS Avinash Reddy bail petition in Supreme Court
  • విచారణకు హాజరుకాలేనని లేఖ రాసిన అవినాశ్ 
  • అవినాశ్ ను అరెస్ట్ చేసేందుకు కర్నూలుకు వెళ్లిన సీబీఐ అధికారులు 
  • వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేసిన అవినాశ్ న్యాయవాది
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనను అదుపులోకి తీసుకునేందుకే హైదరాబాద్, కడప నుంచి సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకున్నారని చెపుతున్నారు. తన తల్లి ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్నారని, ఇప్పుడు విచారణకు హాజరుకాలేనని అవినాశ్ రెడ్డి లేఖ రాసినప్పటికీ సీబీఐ అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ ను అవినాశ్ న్యాయవాది మెన్షన్ చేశారు. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహ బెంచ్ ముందు మెన్షన్ చేశారు. అయితే ఈ పిటిషన్ ను తాము తాము స్వీకరించలేమని మరో వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని ధర్మాసనం తెలిపింది. దీంతో, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అనిరుధ్ బోస్ ధర్మాసనం ముందు అవినాశ్ న్యాయవాది మెన్షన్ చేశారు. అయితే, జస్టిస్ సంజయ్ కరోల్ లేని ధర్మాసనం ముందు మెన్షన్ చేయాలని ధర్మాసనం సూచించింది. దీంతో వేరే ధర్మాసనం ముందు అవినాశ్ న్యాయవాది మెన్షన్ చేయనున్నారు.

YS Avinash Reddy
YSRCP
Supreme Court
bAIL

More Telugu News