YS Avinash Reddy: కర్నూలులో హైటెన్షన్.. ఎంపీ అవినాశ్ రెడ్డి ఉంటున్న ఆసుపత్రికి చేరుకున్న సీబీఐ

CBI officials arrive at vishwabharati hospital in kurnool speculation rife over avinash arrest
  •  ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆసుపత్రికి సీబీఐ అధికారులు
  • ఏ క్షణమైనా ఎంపీని అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారం మొదలు
  • ఆసుపత్రికి భారీగా తరలివస్తున్న వైసీపీ శ్రేణులు, పోలీసుల పటిష్ఠ భద్రత
మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కర్నూలులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆసుపత్రికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా అక్కడే ఉంటున్నారు. మరోపక్క, ఈ నెల 22న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ అవినాశ్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ రోజు తాను విచారణకు హాజరుకాలేనంటూ ఎంపీ ప్రత్యుత్తరం ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆసుపత్రికి చేరుకోవడం చర్చనీయాంశమైంది. తదుపరి ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారం మొదలైంది. ఇదిలా ఉంటే, వైసీపీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేస్తున్నారు.
YS Avinash Reddy

More Telugu News