Jabardasth: కన్నీళ్లు పెట్టిస్తోన్న‘జబర్దస్త్’ యాంకర్ వీడియో

Jabardasth Anchor Soumya Rao gets emotional after remembering her mother
  • తల్లిని తల్చుకుంటూ వీడియో పోస్ట్ చేసిన సౌమ్యా రావు
  • కేన్సర్ తో కన్నుమూసిన సౌమ్య తల్లి
  • చివరి రోజుల్లో నరకం అనుభవించిందని కన్నీటి పర్యంతమైన యాంకర్
శ్రీమంతుడు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సౌమ్యా రావు యాంకర్ గా జబర్దస్త్ కామెడీ షోలోకి అడుగుపెట్టింది. షోలో చలాకీగా ఉంటూ, కంటెస్టెంట్లపై పంచ్ లు విసురుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్క్రీన్ పై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సౌమ్య వ్యక్తిగత జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కుంటోంది. సౌమ్య తల్లి కేన్సర్ తో పోరాడుతూ ఇటీవలే చనిపోయింది. తల్లిని తలుచుకుని సౌమ్య తాజాగా భావోద్వేగానికి గురైంది. చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొ‍న్న నరకం గురించి వివరిస్తూ ఏ తల్లికీ అలాంటి పరిస్థితి రాకూడదని కన్నీటి పర్యంతమైంది. ఆసుపత్రి బెడ్ మీద ఉన్న తల్లిని సంతోషంగా ఉంచేందుకు రీల్స్ చేసిన వీడియోను సౌమ్య తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియో లింక్..

‘అమ్మ కోసం గుడికి వెళ్లి పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా దేవుడు నా మీద దయ చూపలేదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని చాలా బాధపడుతున్నాను. అమ్మా.. ఆఖరి రోజుల్లో నువ్వు పడిన బాధలు మర్చిపోలేక పోతున్నా. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణంగానే మిగిలింది. ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాను. అమ్మా, నా కోసం మళ్లీ పుడతావని వేయికళ్లతో ఎదురు చూస్తున్నా. దేవుడా! మళ్లీ మా అమ్మానాన్నలను నాకు ఇవ్వు. లవ్యూ సో…మచ్‌’ అంటూ సౌమ్య అమ్మపై తనకున్న ప్రేమను పోస్ట్ లో వివరించింది.
Jabardasth
Anchor Soumya Rao
Viral Videos
entertainment

More Telugu News