BRS: ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

AP BRS State Office Inaugurate By President Thota Chandrasekhar In Guntur
  • గుంటూరులో పార్టీ ఆఫీసును ప్రారంభించిన రాష్ట్ర చీఫ్ తోట చంద్రశేఖర్
  • ఐదు అంతస్తుల భవనంలో బీఆర్ఎస్ కార్యాలయం
  • రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ నేతలు
ఆంధ్రప్రదేశ్ లో భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించింది. గుంటూరులో ఐదు అంతస్తుల భవనంలో పార్టీ ఆఫీసును బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ ఆదివారం ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు తరలి వచ్చారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాల్లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే గుంటూరులో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఐదు అంతస్తుల ఈ భవనంలో మొదటి అంతస్తులో కార్యకర్తలతో సమావేశ మందిరం, రెండు మూడు అంతస్తులలో పరిపాలన విభాగాలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. మహారాష్ట్రలో పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. పార్టీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మహారాష్ట్రలో పలు సభలు, సమావేశాలు నిర్వహించారు. మహారాష్ట్ర, ఏపీలతో పాటు మధ్యప్రదేశ్ లోనూ పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
BRS
Andhra Pradesh
BRS office
guntur
Thota Chandrasekhar
party office inauguration

More Telugu News