Robot: ‘నమస్తే! హలో ఇండియా’ అంటూ వెల్కమ్ చెప్పిన రోబో.. వీడియో ఇదిగో!

Robot Greets Namaste Hello India At G7 Summit In Hiroshima
  • జపాన్ కు రావాలంటూ భారతీయులకు ఆహ్వానం
  • హిరోషిమాలో జరుగుతున్న జీ 7 సదస్సులో రోబోల ఏర్పాటు
  • అతిథులను ఆకట్టుకుంటున్న జపనీస్ రోబోలు
జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ 7 సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అతిథులను అలరించేందుకు, స్వాగతించేందుకు జపసీస్ అధికారులు రోబోలను ఏర్పాటు చేశారు. భారతీయ ప్రతినిధులను ఆహ్వానిస్తూ సదరు రోబో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చేయి ఊపుతూ ‘నమస్తే! హలో ఇండియా’ అంటూ అతిథులకు రోబో వెల్కమ్ చెప్పింది. ఇండియన్లకు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా అంటూ ఓ యువతి ప్రశ్నించగా.. జపాన్ కు రావాలంటూ భారతీయులను ఆహ్వానిస్తానని చెప్పింది. జపాన్ సంస్కృతి గురించి మరింత తెలుసుకోవడానికి తప్పకుండా తమ దేశానికి రావాలని పిలుపునిచ్చింది.
Robot
G7 Summit
Hiroshima
Japan
greeting

More Telugu News