Ntr: ఎన్టీఆర్ గురించి జయసుధ .. జయప్రద ఏమన్నారంటే ..!

  • హైదరాబాద్ వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు 
  • హాజరైన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు 
  • ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానన్న జయసుధ 
  • ఆయన పేద ప్రజల దేవుడని చెప్పిన జయప్రద  
NTR 100 years celabrations

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను హైదరాబాదులో ఘనంగా ఏర్పాటు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఎన్టీఆర్ తో జయసుధ .. జయప్రద చాలా చిత్రాలలో నటించారు. ఆయనతో వారికి మంచి అనుబంధం ఉంది.

ఈ వేదికపై జయసుధ మాట్లాడుతూ .. "రామారావుగారి గురించి ఐదు .. పది నిమిషాల్లో మాట్లాడలేము. ఆయన నుంచి నేను క్రమశిక్షణను నేర్చుకున్నాను. నా అదృష్టం ఏమిటంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయనతో 'నా దేశం' సినిమాలో నటించాను. ఆయన రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయనతో 'శ్రీనాథ కవిసార్వభౌమ' చేశాను" అని అన్నారు. జయప్రద మాట్లాడుతూ .. "ఎన్టీఆర్ .. అభిమానులందరికీ ఆయన ఎన్టీవోడు. పేద ప్రజల గుండెల్లో  నిరంతరం నిలిచినటువంటి దేవుడు. అలాంటి కారణజన్ముడిని శతజయంతి వేడుక సందర్భంగా గుర్తుచేసుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే నేను రాజకీయాలలోకి వచ్చాను .. అంతకుమించిన ఆశీర్వాదం ఏవుంటుంది?" అంటూ ముగించారు.

More Telugu News