ఒక ఆడ సింహం బలం ఎంతో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది!
- సింహం ఒకవైపు... ముగ్గురు బాడీ బిల్డర్లు మరోవైపు...!
- తాడును లాగే పోటీ
- సింహాన్ని అంగుళం కూడా కదల్చలేకపోయిన బాడీబిల్డర్లు
- వీడియో వైరల్
ఓ గట్టి తాడు కొసను ఆడ సింహం నోటితో పట్టుకోగా... ఆ తాడు మరో కొసను ముగ్గురు బాడీ బిల్డర్లు పట్టుకున్నారు. వాళ్లు ఎంత కష్టపడినా ఆ ఆడ సింహాన్ని అంగుళం కూడా కదల్చలేకపోయారు. ఆ ముగ్గురు బలాఢ్యులు ఆపసోపాలు పడ్డారు కానీ, అవతలివైపు ఉన్న సింహం మాత్రం "ఓస్ ఇంతేనా" అన్నట్టుగా తన శక్తిని ఘనంగా ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.