The Kerala Story: కేరళ స్టోరీలో ఆ సీన్లు చూసి బామ్మ ఏమంటుందోనని భయపడ్డా: అదా శర్మ

 Adah Sharma Opens Up About DISTURBING scenes in The Kerala Story
  • అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ
  • వివాదాస్పదం అయినా భారీ హిట్ గా నిలిచిన చిత్రం
  • ఇప్పటికే రూ. 200 కోట్ల కలెక్షన్లు
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ అద్భుత విజయంతో దూసుకుపోతోంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారినప్పటికీ ఇప్పటికే రూ. 200 కోట్ల కలెక్షన్ రాబట్టి హిట్ లిస్ట్ లో చేరింది. ఈ సినిమాలో ఇస్లాం మతంలోకి మారడానికి, ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేరేందుకు ట్రాప్‌ అయిన షాలిని ఉన్నికృష్ణన్ అనే మహిళ పాత్రలో అదా శర్మ నటించింది. అద్భుత నటనతో అదా అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంది. అయితే, ఈ సినిమా చూసిన తర్వాత తన బామ్మ ఏమంటుందోనని చాలా భయపడ్డానని ఆమె తెలిపింది. ముఖ్యంగా సినిమాలోని అత్యాచార దృశ్యాలను చూసి ఆమె ఎలా స్పందిస్తుందోనని టెన్షన్ కు గురయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

‘మా అమ్మ, బామ్మకు కథ తెలుసు. కానీ, సినిమా చూసిన తర్వాత బామ్మ స్పందన గురించి నేను భయపడ్డాను. ముఖ్యంగా సినిమాలోని అత్యాచార దృశ్యాలపై ఆందోళన చెందా. కలతపెట్టే ఆ సీన్లను చూసిన తర్వాత ఆమె ఎలా స్పందిస్తుందనే దాని గురించి మాత్రమే ఆందోళన ఉంది.  90 ఏళ్ల మా బామ్మ అత్యంత దృఢమైన వ్యక్తని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఆమె దీన్ని వాస్తవ సమాచారాన్ని బోధించిన చిత్రంగా పేర్కొన్నారు. తన విద్యార్థులందరూ దీన్ని చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను ఇది అడల్ట్‌ సినిమా అని అంటే.. అప్పుడు దీనికి యు/ఎ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుందని, తద్వారా యువతులు కూడా సినిమా చూసి తమ చుట్టూ జరిగే విషయాల పట్ల అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుందన్నారు’ అని అదా చెప్పుకొచ్చింది.
The Kerala Story
adah sharma
scenes

More Telugu News