Family: కుటుంబం కల నెరవేరితే సంతోషం ఇలా ఉప్పొంగుతుంది..!

Family buys car celebrates with a dance in the showroom Anand Mahindra shares heartwarming video
  • మహీంద్రా స్కార్పియో డెలివరీతో పట్టరాని ఆనందం
  • వాహనం ముందు కుటుంబ సభ్యులంతా నృత్యం
  • ఇదే నిజమైన బహమతి అని పేర్కొన్న ఆనంద్ మహీంద్రా
సొంతిల్లు, సొంత కారు.. ఎన్నో మధ్యతరగతి కుటుంబాలకు ఇవి జీవిత కలలు. అవి నెరవేరిన రోజు వారిలో ఆనందం పొంగి పొర్లుతుంది. అది చూసే వారినీ సంతోషానికి గురి చేస్తుంది. అలాంటి ఘటనే ఇది. ఓ కుటుంబం మహీంద్రా స్కార్పియో ఎస్ఎస్ వీని కొనుగోలు చేసింది. డెలివరీ తీసుకునే సమయంలో వాహనం ముందు యావత్ కుటుంబ సభ్యులు సంతోషంగా డ్యాన్స్ చేశారు. ‘ఎంతో సంతోషకరమైన క్షణం’ అంటూ ఇందుకు సంబంధించిన వీడియోని కార్ న్యూస్ గురూ పేరుతో ఉన్న ట్విట్టర్ పేజీ షేర్ చేసింది. 

ఇది మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాను సైతం ఆకట్టుకుంది. తన ట్విట్టర్ హ్యాండిల్ పై రీ పోస్ట్ చేశారు. ‘‘భారత ఆటోమొబైల్ పరిశ్రమలో పనిచేస్తున్నందుకు ఇదే నిజమైన ఆనందం, బహుమతి’’ అంటూ ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో పేర్కొన్నారు. నిజమే.. అందుకే మనల్ని భారతీయులు అంటారంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.
Family
dance
scorpio delivery
Anand Mahindra
video shares

More Telugu News