Justice Akula Venkata Sesha Sai: ఏపీ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి

  • ఏపీ హైకోర్టుకు టెంపరరీ చీఫ్ జస్టిస్ నియామకం
  • ఇప్పటివరకు హైకోర్టు జడ్జిగా కొనసాగిన జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి
  • సీజే పీకే మిశ్రా పదోన్నతిపై సుప్రీంకోర్టుకు బదిలీ
Justice Akula Venkata Seshasai appointed as AP High Court acting Chief Justice

ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి నియమితులయ్యారు. వెంకటశేషసాయి ఇప్పటివరకు ఏపీ హైకోర్టులో జడ్జిగా కొనసాగారు. తాజాగా ఆయనకు చీఫ్ జస్టిస్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటిదాకా హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యవహరించారు. మిశ్రాకు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల కొలీజియం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

అప్పట్లో విపక్షనేతగా ఉన్న వైస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి జరగ్గా, వైసీపీ నేతలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై  జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి విచారణ జరిపారు. 

అంతేకాదు, గతంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సకల నేరస్తుల సర్వేలోని లోటుపాట్లను కూడా వెంకటశేషసాయి ఎత్తిచూపారు. రెండేళ్ల కిందట ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వివాదంపైనా తీర్పు ఇచ్చారు.

More Telugu News