Bandla Ganesh: 'దేవర' టైటిల్ నాదే... కొట్టేశారు: బండ్ల గణేశ్

Bandla Ganesh says he had registered Devara title earlier
  • ఎన్టీఆర్, కొరటాల కాంబోలో కొత్త చిత్రం
  • ఈ సాయంత్రం టైటిల్ అనౌన్స్ చేసిన చిత్రబృందం
  • 'దేవర' టైటిల్ ను తాను రిజిస్టర్ చేయించి మర్చిపోయానన్న బండ్ల గణేశ్
  • అయినా ఎన్టీఆర్ మనవాడే కాబట్టి ఇబ్బంది లేదని వెల్లడి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్తం చిత్రం టైటిల్ 'దేవర' తనదేనని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అంటున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బర్త్ డే (మే 20)ని పురస్కరించుకుని ఒకరోజు ముందే సినిమా టైటిల్ 'దేవర'ను ప్రకటించారు.  

కాగా 'దేవర' టైటిల్ ను తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని బండ్ల గణేశ్ వెల్లడించారు. ఈ సాయంత్రం 7 గంటల తర్వాత 'దేవర' టైటిల్ ను చిత్రబృందం రిలీజ్ చేయగా, బండ్ల గణేశ్ అంతకుముందు టైటిల్ పై కలకలం రేపారు. రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత తాను ఆ టైటిల్ గురించి మర్చిపోయానని, అందువల్లే తన టైటిల్ ను కొట్టేశారని ఆరోపించారు. 

అయితే, ఈ విషయంలో తనకేమీ సమస్య లేదని తెలిపారు. ఇది మన యంగ్ టైగర్ సినిమానే కదా... ఆయన కూడా నాకు దేవరే అంటూ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మొత్తానికి ఎన్టీఆర్ కొత్తం చిత్రం టైటిల్ సూపర్ గా ఉంది అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.
Bandla Ganesh
Devara
Title
NTR30
Jr NTR
Koratala Siva
Tollywood

More Telugu News