IPL 2023: లక్నో జట్టులో మరో కొత్త ప్లేయర్ కు చోటు

LSG announce late replacement for injured India star ahead of intense IPL 2023 playoffs race
  • గాయం కారణంగా సీజన్ ఆరంభంలోనే దూరమైన జయదేవ్ ఉనద్కత్
  • అతడి స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేసిన లక్నో సూపర్ జెయింట్స్
  • రూ.20 లక్షల ధరపై సూర్యాన్ష్ షెడ్గేతో ఒప్పందం
లక్నో సూపర్ జెయింట్స్ లీగ్ దశ చివర్లో, మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ప్లేయర్ కు చోటు కల్పించింది. ఐపీఎల్ 2023 సీజన్ ప్లేఆఫ్ కు లక్నో సూపర్ జెయింట్స్ కేవలం ఒక్క మెట్టు దూరంలోనే ఉంది. శనివారం కోల్ కతాతో జరిగే చివరి మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయమవుతుంది. 

మరోవైపు లక్నో జట్టును గాయాల బెడద వేధిస్తోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయంతో సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. దీంతో కృనాల్ పాండ్యా జట్టును నడిపిస్తున్నాడు. అలాగే సీజన్ కు ముందు మినీ వేలంలో రూ.50 లక్షలు పెట్టి తెచ్చుకున్న జయదేవ్ ఉనద్కత్ సైతం గాయం కారణంగా మొదట్లోనే దూరమయ్యాడు.

అయితే కేఎల్ రాహుల్ స్థానంలో ఆర్సీబీ మాజీ ప్లేయర్ కరుణ్ నాయర్ ను లక్నో సూపర్ జెయింట్స్ నియమించుకుంది. జయదేవ్ ఉనద్కత్ స్థానాన్ని సైతం ఇప్పుడు మరో ఆటగాడితో భర్తీ చేసింది. సూర్యాన్ష్ షెడ్గేతో ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. రూ.20 లక్షల ధరపై అతడ్ని తీసుకుంది. సీజన్ ఆరంభంలో ప్రాక్టీస్ సమయంలో జయదేవ్ ఉనద్కత్ భుజానికి గాయం కావడంతో అందుబాటులో లేకుండా పోయాడు.
IPL 2023
playoffs race
LSG
replacement
jayadev Unadkat

More Telugu News