Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

These stocks fell 5 percent or more in Thursdays session
  • లాభాల్లో ప్రారంభమైన సూచీలు
  • గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు
  • నిరాశపరిచిన వివిధ కంపెనీల మార్చి క్వార్టర్ ఫలితాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం కాస్త సానుకూలంగా ప్రారంభమైన సూచీలు, గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ రోజు వెలువడిన పలు కంపెనీల మార్చి క్వార్టర్ ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. ఎస్బీఐ, ఐటీసీ కంపెనీల ఫలితాలు మరింత దెబ్బతీశాయి. సెన్సెక్స్ ఈ రోజు 129 పాయింట్లు నష్టపోయి 61,431 పాయింట్ల వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు క్షీణించి 18104 వద్ద ముగిశాయి.

ఈ రోజు పలు స్టాక్స్ ఐదు శాతం అంతకంటే ఎక్కువగా నష్టపోయాయి. శ్రేయాస్ షిప్ 19.29 శాతం, రిద్ధి సిట్లీ అండ్ టబ్ 19.15 శాతం, నైస్సా కార్పోరేషన్ 11.67 శాతం, నిహార్ ఇన్ఫో గ్లోబ్ 11.28 శాతం, పర్మినెంట్ మ్యాగ్నెట్ 11.16 శాతం నష్టపోయాయి.
Stock Market
Sensex
Nifty

More Telugu News