randeep: సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారాన్ని సెలబ్రేషన్‌గా భావించడం లేదు!: కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా

  • మిత్రపక్షాలను ఆహ్వానిస్తామన్న కాంగ్రెస్ నేత రణదీప్ 
  • ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంకితభావానికి ఇది నిదర్శనమని వ్యాఖ్య
  • ప్రజాస్వామ్యం కోసం పోరాడాలనుకునే వారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్న రణదీప్
All our allies will be invited says Surjewala

కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి తమ మిత్రపక్షాలందరినీ ఆహ్వానిస్తామని కర్ణాటక ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా గురువారం వెల్లడించారు. ప్రజా సేవే తమ పార్టీ ఏకైక సూత్రమని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనుకునే వారు ఎంత కావాలంటే అంత చేయవచ్చునని చెప్పారు.

ఇది ఓ సెలబ్రేషన్ గా లేదా వేడుకగా తాము భావించడం లేదని, ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంకితభావానికి నిదర్శనం అని అన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడాలనుకునే వారు, రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే వారు అందరూ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కావొచ్చునని చెప్పారు.

కాగా, మే 20వ తేదీ మధ్యాహ్నం గం.12.30 సమయానికి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలను అన్నింటినీ ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. సిద్ధరామయ్య కేబినెట్లో శివకుమార్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండనున్నారు.

More Telugu News