Harry Tector: వన్డే ర్యాంకుల్లో కోహ్లీ, రోహిత్ లను వెనక్కి నెట్టేసిన ఐర్లాండ్ క్రికెటర్

Ireland Harry Tector turns heads by overtaking Kohli Rohit de Kock Buttler in ICC ODI rankings
  • 7వ స్థానానికి దూసుకొచ్చేసిన హ్యారీ టెక్టార్
  • బంగ్లాదేశ్ తో సిరీస్ లో రాణించడంతో మెరుగైన స్థానం
  • 8వ స్థానంలో విరాట్ కోహ్లీ, 10వ స్థానంలో రోహిత్ శర్మ
ఐర్లాండ్ క్రికెటర్ హ్యారీ టెక్టార్ వన్డే ర్యాంకుల్లో మెరిశాడు. టాప్-10లో చోటు సంపాదించుకున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్ - ఐర్లాండ్  కు మధ్య జరిగిన వన్డే మ్యాచులో టెక్టార్ తన కెరీర్ లోనే మెరుగైన 140 స్కోర్ ను నమోదు చేశాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో 206 పరుగులు సాధించాడు. దీంతో 72 పాయింట్లు మెరుగుపరుచుకుని టాప్-10లోకి దూసుకుపోయాడు.

తాజా ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకుల్లో హ్యారీ టెక్టార్ 722 రేటింగ్ తో ఏడో స్థానంలోకి వచ్చేశాడు. విరాట్ కోహ్లీ 719 రేటింగ్ తో 8వ స్థానంలో ఉంటే, దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డీకాక్ 718 రేటింగ్ తో 9వ స్థానంలో, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 707 రేటింగ్ తో 10వ స్థానంలో నిలిచారు. ఇక టాప్ 6లో బాబర్ అజామ్, రస్సీ వాండర్ డుస్సేన్, ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, శుభ్ మన్ గిల్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.
Harry Tector
Ireland cricketer
ICC ODI rankings
Virat Kohli
Rohit Sharma

More Telugu News