RRR: చరణ్, తారక్‌కు మరో గౌరవం.. జపాన్ మ్యాగజైన్ కవర్ పేజీపై చోటు

Ram Charan and Jr NTR featured on the cover page of Japan highly acclaimed lifestyle magazine
  • ఆర్ఆర్ఆర్ హీరోలను గౌరవించిన జపనీస్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అనన్
  • ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ, తారక్‌ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు
  • జపనీస్‌లో ఆర్ఆర్ఆర్‌‌కు బ్రహ్మరథం పట్టిన అక్కడి ప్రేక్షకులు
ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్టార్‌‌డమ్ అమాంతం పెరిగింది. ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అనేక అంతర్జాతీయ అవార్డులు వరించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటనకు గాను ఇద్దరిపై ప్రశంసల వర్షం కురింసింది. దాంతో, భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ వీరి ఫ్యాన్‌ బేస్ భారీగా పెరిగింది. ముఖ్యంగా జపాన్‌లో చరణ్, తారక్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జపనీస్‌లో ప్రదర్శించినప్పుడు అక్కడి అభిమానులు ఊగిపోయారు.

తాజాగా జపాన్‌కు చెందిన ఓ ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అనన్ చరణ్, తారక్ ఫొటోలను తమ తాజా ఎడిషన్ కవర్ పేజీపై  ముద్రించింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మ్యాగజైన్‌ కవర్ పేజీని షేర్ చేసింది. ఇప్పటిదాకా వివిధ దేశాలకు చెందిన ఇంగ్లిష్ మ్యాగజైన్ల కవర్ పేజీలపై మన దేశ హీరోలు చోటు దక్కించుకోగా.. జపనీస్ మ్యాగజైన్ ముఖచిత్రంగా మారిన ఘనత తారక్, చరణ్ సొంతం అయింది.
RRR
Ramcharan
Jr NTR
japan
magazine
cover page

More Telugu News