రాహుల్ గాంధీ, ఖర్గేలతో ఏం చర్చించలేదు: డీకే శివకుమార్
- కేవలం ప్రణామ్ చేసి వచ్చానన్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్
- సిద్ధూ, డీకేలతో ఢిల్లీ పెద్దల వరుస భేటీలు
- డీకే సొంత జిల్లా రామనగరలో కట్టుదిట్టమైన భద్రత
కర్ణాటకలోని రామనగర జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రామనగర డీకే శివకుమార్ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్యను ప్రకటించనున్నారని, ఈ మేరకు దాదాపు నిర్ణయం జరిగిందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో శివకుమార్ మద్దతుదారులు రామనగరలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.