Bhuma Akhila Priya: అఖిలప్రియ దంపతులకు 14 రోజుల రిమాండ్

14 days remmand for Akhila priya
  • ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిలప్రియ అరెస్ట్
  • అఖిల దంపతులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • నిందితులిద్దరికీ రిమాండ్ విధించిన కోర్టు

యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా మంగళవారం రాత్రి టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏవీ సుబ్బారెడ్డిపై భూమా వర్గీయుడు దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బుధవారం ఉదయం అఖిలప్రియను, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఈ దాడి కేసులో అఖిలప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు వారిని కర్నూలు జైలుకు తరలించారు.

కొత్తపల్లి వద్ద ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియను అరెస్ట్ చేసి పాణ్యం పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. సెక్షన్ 307 కింద అఖిలప్రియపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అఖిలప్రియ దంపతులిద్దరికీ కోర్టు రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News