Siddaramaiah: కర్ణాటక సీఎం అభ్యర్థిని రేపు బెంగళూరులో ప్రకటించనున్న ఖర్గే

Kharge likely to announce next Karnataka CM tomorrow in Bengaluru
  • సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అనంతరం నిర్ణయానికి రానున్న ఖర్గే
  • ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న కాంగ్రెస్ వర్గాలు
  • అందరి నుండి ఖర్గే సమాచారం సేకరిస్తారు
కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం రాత్రి వరకు కూడా ఎటూ తేల్చలేకపోయింది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. బెంగళూరులో ఈ ప్రకటన చేయవచ్చునని చెబుతున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి, వారితో చర్చించిన అనంతరం ఖర్గే తుది నిర్ణయానికి వస్తారని చెబుతున్నారు.

కర్ణాటక సీఎం పోస్ట్ పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పార్టీ అధినేత అందరినీ కలిసి, వారి నుండి సమాచారం సేకరిస్తారని, ఆ తర్వాత రాహుల్, సోనియా గాంధీని కలిసి నిర్ణయం ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రేపటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవచ్చునని, రేపు బెంగళూరులోనే ఖర్గే ప్రకటన చేస్తారని అంటున్నారు. కర్ణాటక సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు ఖర్గేను వేర్వేరుగా కలిసిన విషయం తెలిసిందే.
Siddaramaiah
DK Shivakumar
Congress
Mallikarjun Kharge

More Telugu News