Gujarat Titans: ప్లేఆఫ్ కు గుజరాత్ టైటాన్స్.. ప్రశంసలు కురిపించిన ఆరోన్ ఫించ్

Gujarat Titans coach Ashish Nehra and captain Hardik Pandya deserve credit for playoffs says Aaron Finch
  • కెప్టెన్ పాండ్యా, కోచ్ ఆశిష్ నెహ్రాపై ప్రశంసలు
  • గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ విక్రమ్ సోలంకిని మెచ్చుకున్న ఫించ్
  • ఇతర ఫ్రాంచైజీలతో పోలిస్తే బలంగా కనిపిస్తున్న గుజరాత్ జట్టు
ఆస్ట్రేలియా ప్రముఖ మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా, కోచ్ ఆశిష్ నెహ్రాలను ప్రశంసించాడు. హార్థిక పాండ్యా, విక్రమ్ సోలంకి గుజరాత్ టైటాన్స్ ను ఓ మంచి సమన్వయంతో కూడిన జట్టుగా రూపొందించినట్టు ఆరోప్ ఫించ్ గుర్తు చేశారు. సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్ కు దూసుకుపోవడం తెలిసిందే. ఈ ఘనత పాండ్యా, నెహ్రాదేనని ఫించ్ పేర్కొనడం గమనార్హం.

జట్టును రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన గుజరాత్ టైటాన్స్ జట్టు డైరెక్టర్ విక్రమ్ సోలంకి, కోచ్ నెహ్రా, కెప్టెన్ పాండ్యాని ఆరోన్ ఫించ్ మెచ్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్లేయర్లతో చక్కని సమన్వయంతో కూడిన జట్టును రూపొందించినట్టు అభిప్రాయపడ్డారు. విడిగా ప్రతిభ కలిగిన ఆటగాళ్లను గుర్తించడం, వారి నేపథ్యం, ప్రాధాన్యతను గుర్తించడం అనే సవాళ్లను ఈ ముగ్గురు ఎదుర్కొన్న తీరును పింఛ్ ప్రస్తావించారు. జట్టులో ఆటగాళ్ల సమన్వయం, కెప్టెన్సీ ప్రాధాన్యతను తన మాటల ద్వారా ఫించ్ గుర్తు చేశారు. 

గుజరాత్ టైటాన్స్ గత సీజన్ ఐపీఎల్ టైటిల్ విజేతగా ఉండడం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంచైజీలు అధిక శాతం విదేశీ కోచ్ లపై ఆధారపడిన పరిస్థితుల్లో, విదేశీ సంస్థకు చెందిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ దేశీ సీనియర్ బౌలర్ అయిన ఆశిష్ నెహ్రాను గుర్తించి, కోచ్ పదవితో గౌరవ అవకాశం కల్పించడం తెలిసిందే.
Gujarat Titans
coach Ashish Nehra
captain Hardik Pandya
credit
playoffs

More Telugu News