Nara Bhuvaneswari: వలంటీర్లకు స్వయంగా భోజనం వడ్డించిన నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!

  • యువగళం పాదయాత్రకు 100వ రోజు
  • లోకేశ్ తో కలిసి నడిచిన నారా భువనేశ్వరి
  • క్యాంప్ సైట్లో లోకేశ్ టీమ్, వలంటీర్లతో మాటామంతీ
  • లోకేశ్ కు వలంటీర్లు అందిస్తున్న సేవలను కొనియాడిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneswari met Lokesh team volunteers in camp site

యువగళం పాదయాత్ర 100వ రోజున టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ తో పాటు ఆయన తల్లి నారా భువనేశ్వరి కూడా కలిసి నడవడం తెలిసిందే. యువగళం క్యాంప్ సైట్ లో వలంటీర్లతో ఆమె కాసేపు ముచ్చటించారు. 

వలంటీర్లకు, యువగళం టీమ్ కు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా వలంటీర్లతో మాట్లాడుతూ... ఒక్క రోజు నడవడమే మాకు చాలా కష్టంగా అనిపించిందని, కానీ వలంటీర్లు 100 రోజులుగా లోకేశ్ వెంటే నడవడం అభినందనీయం అని పేర్కొన్నారు. 

"విజన్ ఉన్న నాయకుడు లోకేశ్. ఇలాంటి వ్యక్తికి మీలాంటి గొప్ప టీమ్ దొరకడం అదృష్టం. మీ సేవలు ఇలాగే కొనసాగించండి. మీతో మేముంటాం" అని వలంటీర్లతో భువనేశ్వరి అన్నారు. 

వలంటీర్ల వసతులపై కోఆర్డినేటర్లను ఆమె ఆరా తీశారు. వలంటీర్లను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కుటుంబాలను వదిలిపెట్టి వచ్చి యువగళం పాదయాత్రలో లోకేశ్ కు అండగా నిలుస్తున్నారని వలంటీర్లను కొనియాడారు. వలంటీర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఏమి ఇచ్చినా రుణం తీరదని నారా భువనేశ్వరి అన్నారు. 

More Telugu News