DK Shivakumar: నేను బ్లాక్‌మెయిల్ చేయను... సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్!: డీకే శివకుమార్ వ్యాఖ్య

Should Have Basic Courtesy says  DK Shivakumar Amid Karnataka Tug Of War
  • హఠాత్తుగా ఢిల్లీ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్న డీకే
  • అనారోగ్యం కారణంగా వెళ్లడం లేదని వెల్లడి
  • తిరుగుబాటు చేయనని స్పష్టం చేసిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్
  • చిన్నపిల్లాడిని కాదని, ఎవరి ట్రాప్ లో పడనని వ్యాఖ్య

ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న ఇద్దరిలో ఒకరైన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను హఠాత్తుగా రద్దు చేసుకున్నారు. ఉదయమే సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. డీకే శివకుమార్ రాత్రి ఢిల్లీకి బయలుదేరుతారని వార్తలు వచ్చాయి. తాను తన గురువును కలిసిన తర్వాత ఢిల్లీకి వెళ్తానని కూడా ఆయన మధ్యాహ్నం ప్రకటించారు. కానీ సాయంత్రానికి ఢిల్లీ పర్యటనను క్యాన్సిల్ చేసుకొని ట్విస్ట్ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా తాను ఢిల్లీకి వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు.

తాను ఢిల్లీకి వెళ్లడం లేదని చెప్పిన డీకే శివకుమార్... సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ చేశారు. మీరు కర్ణాటకలో పార్టీని గెలిపిస్తారని నాకు నమ్మకముందని సోనియా గాంధీ తనతో అన్నారని, నేను ఇక్కడ కూర్చొని, తన బాధ్యతలను నిర్వర్తించానని చెప్పారు. మనం కృతజ్ఞతగా, మర్యాదగా ఉండాలన్నారు. ఈ గెలుపు వెనుక ఎవరున్నారనే అభిమానం వారికి ఉండాలన్నారు.

తిరుగుబాటు చేస్తారా అని ప్రశ్నించగా సూటిగా సమాధానం చెప్పారు. తాను తిరుగుబాటు చేయనని, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడనని చెప్పారు. తనకంటూ సొంత వ్యక్తిత్వం ఉందని, తానేం చిన్న పిల్లాడిని కానని చెప్పారు. తాను ఎవరి ట్రాప్ లో పడనని చెప్పారు.

  • Loading...

More Telugu News