Rojaramani: రాఘవేంద్రరావుగారికి నాపై ఉన్న నమ్మకం అది: రోజా రమణి

Roja Ramani Interview
  • బాలనటిగా మెప్పించిన రోజారమణి 
  • హీరోయిన్ గా ఆకట్టుకున్న నాయిక
  • 500 సినిమాలకి పైగా డబ్బింగ్ 
  • ఒకే సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్
బాలనటిగా .. ఆ తరువాత హీరోయిన్ గా .. కేరక్టర్ ఆర్టిస్టుగా .. డబ్బింగ్ ఆర్టిస్టుగా రోజారమణి ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ముఖ్యంగా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆమె చాలామంది స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ప్రస్తావించారు. 

నా పెళ్లి తరువాత ఇక సినిమాలు చేసేంత సమయం లేదు. అప్పుడు నేను డబ్బింగ్ ఆర్టిస్టుగా మారవలసి వచ్చింది. అదే సమయంలో ఇతర భాషల నుంచి వచ్చే కథానాయికల సంఖ్య పెరుగుతూ రావడం కూడా నాకు కలిసొచ్చింది. అందువలన దాదాపు 500 సినిమాలకి పైగా డబ్బింగ్ చెప్పాను" అన్నారు. 

'ముగ్గురు మొనగాళ్లు' సినిమాలో చిరంజీవి సరసన రోజా .. రమ్యకృష్ణ .. నగ్మా నటించారు. ముగ్గురు హీరోయిన్స్ పాత్రలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నేను రమ్యకృష్ణకి డబ్బింగ్ చెబుతూ ఉండగా రాఘవేంద్రరావు గారు వచ్చారు. మిగతా హీరోయిన్స్ ఇద్దరికీ కూడా నన్నే డబ్బింగ్ చెప్పమన్నారు. ఆ వేరియేషన్ తో నువ్వు చెప్పగలవు .. నాకు తెలుసు' అనేసి వెళ్లిపోయారు. నాపై ఆయనకి ఉన్న నమ్మకం అది" అని చెప్పుకొచ్చారు.
Rojaramani
Actress
Tollywood

More Telugu News