KTR: మోదీ సృష్టించే ఇబ్బందులను తట్టుకుని తెలంగాణకు పరిశ్రమలు తీసుకురావడం మామూలు విషయం కాదు: కేటీఆర్

  • తెలంగాణలో ఫాక్స్ కాన్ పరిశ్రమ ఏర్పాటు
  • రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ వద్ద నేడు భూమి పూజ
  • హాజరైన మంత్రి కేటీఆర్
  • పోటీ ప్రపంచంలో ఓ పరిశ్రమను ఆకర్షించడం ఎంతో కష్టమని వెల్లడి
  • ఫాక్స్ కాన్ ను స్థానికులు కడుపులో పెట్టుకుని చూసుకోవాలని సూచన
kTR speech in Kongarakalan

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో ఇవాళ ఫాక్స్ కాన్ పరిశ్రమకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న పోటీ పరిస్థితుల్లో ఓ పరిశ్రమను కానీ, ఓ సంస్థను కానీ తీసుకురావడం మామూలు విషయం కాదని అభిప్రాయపడ్డారు. 

ముఖ్యంగా, మోదీ పెట్టే ఇబ్బందులను తట్టుకుని తెలంగాణకు పరిశ్రమలను ఆకర్షించడం ఆషామాషీ వ్యవహారం కాదని అన్నారు. సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహంతో ఐటీ విభాగం, పరిశ్రమల విభాగం ఎంతో పోరాడుతుంటేనే ఒక్కో పరిశ్రమ, సంస్థ రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. 

కష్టసాధ్యమైన పరిస్థితుల్లో కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తున్నామని, అయితే, వచ్చిన కంపెనీలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులపైనే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఫాక్స్ కాన్ సంస్థేనని, మునుపెన్నడూ లేని స్థాయిలో ఫాక్స్ కాన్ సంస్థ లక్ష ఉద్యోగాలు తీసుకువస్తోందని తెలిపారు.

More Telugu News