Karnataka: ఓటమి ఎఫెక్ట్​.. కర్ణాటక బీజేపీలో సమూల ప్రక్షాళన!

  • అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం
  • ఓటమి కారణాలను విశ్లేషిస్తున్న కేంద్ర నాయకత్వం
  • మోర్చా స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు మార్పులకు అవకాశం
 Karandlaje to Replace Kateel As State BJP Chief after The Karnataka Debacle Effect

కర్ణాటకలో మరోసారి అధికారంలోకి రావాలని ఆశించిన బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీ, హో మంత్రి అమిత్ షా రంగంలోకి దిగినా.. ముమ్మరంగా ప్రచారం చేసినా శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఓటమి నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో సమూల మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని నళిన్ కుమార్ కటీల్ సిద్ధమయినట్టు సమాచారం. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి శోభ కరాంద్లజేను బీజేపీ రాష్ట్ర అధినేతగా నియమించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు శాసన సభలో ప్రతిపక్ష నేత పదవికి నలుగురు పోటీలో ఉన్నారు.  

66 స్థానాల్లో గెలిచిన బీజేపీ పార్టీలో కుల సమీకరణాలు కూడా చేసుకొని ప్రతిపక్ష నేతను అధిష్ఠానం ఖరారు చేయనుంది. మరోవైపు, రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర శాఖలో అన్ని స్థాయుల్లోనూ మార్పులు చేయాలని బీజేపీ ఆలోచిస్తోందని తెలుస్తోంది. కర్ణాటక బీజేపీలో మోర్చా స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు మార్పులు తప్పవని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. కుల సమీకరణాలను సమతుల్యం చేసేందుకు బీజేపీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. 66 స్థానాలతో బీజేపీ ప్రాథమిక ప్రతిపక్షంగా ఆవిర్భవించడంతో ప్రతిపక్ష నేత పదవికి నలుగురు ప్రధాన పోటీదారుల పరిశీలనకు దారితీసింది.

'బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కటీల్‌ మాత్రమే కాదు, మోర్చా స్థాయి నుంచి అగ్రస్థాయి వరకు మొత్తం బీజేపీని మార్చేస్తారు. ఎన్నికల్లో ఎక్కడ తప్పు జరిగిందో.. బీజేపీపై ఓటర్లకు ఎందుకు నమ్మకం సన్నగిల్లిందో కేంద్ర నాయకత్వం విశ్లేషించిన తర్వాత మార్పులు జరుగుతాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 28 సీట్లలో 25 సీట్లను బీజేపీ గెలుచుకునేలా చేయగల బలమైన ఆర్గనైజర్, లీడర్ పార్టీకి కావాలి’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

More Telugu News