Vokkaliga: డీకే శివకుమార్‌ను సీఎం చేయాలంటూ ఒక్కలిగల గురువుల తీర్మానం

Vokkaliga seers back Shivakumars candidature for Karnataka CM
  • కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
  • నిన్న ఒక్కలిగల గురువుల సమావేశం
  • సీఎం పదవికి డీకే అర్హుడన్న స్వామి నిర్మలానంద
కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేదెవరంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య ఈ విషయంలో పోటీ నెలకొంది. 

సీఎం పదవికి డీకే అర్హుడంటూ ఒక్కలిగల గురువు ఆది చంచనగిరి నిర్మలానందనాథ స్వామీజీ తాజాగా వ్యాఖ్యానించారు. ఆయనను సీఎం చేయాలని కాంగ్రెస్‌కు సూచించారు. నిన్న జరిగిన ఒక్కలిగల గురువుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్యలకు ఈ మేరకు విజ్ఞప్తి చేయాలని సమావేశంలో తీర్మానించినట్టు నిర్మలానంద తెలిపారు.
Vokkaliga
Adi Chunchanagiri Nirmalananda Natha Swamiji
Karnataka
Congress
DK Shivakumar
Siddaramaiah

More Telugu News