Santhosh Sobhan: నందిని రెడ్డికి మరో నాని దొరికాడు: 'అన్నీ మంచి శకునములే' ఈవెంటులో నాని!

Anni Manchi Sakunamule Pre Release Event
  • నందినీ రెడ్డి నుంచి 'అన్నీ మంచి శకునములే'
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో సాగే కథ
  • సంతోష్ శోభన్ జోడీగా మాళవిక నాయర్  
  • సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయర్
  • ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల 

సంతోష్ శోభన్ - మాళవిక నాయర్ జంటగా 'అన్నీ మంచి శకునములే' సినిమా రూపొందింది. స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమాకి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. నాని - దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథులుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదు .. శిల్పకళా వేదికలో నిర్వహించారు.
 
ఈ వేదికపై నాని మాట్లాడుతూ .. "ఈ సినిమాకి నేను చీఫ్ గెస్టును అంటూ నా పేరు వేసి వెల్ కమ్ చెప్పారుగానీ, నిజానికి నేను ఆ ఫ్యామిలీకి చెందినవాడినే. నా సినిమా 'అలా మొదలైంది'తోనే నందినీ రెడ్డిగారి కెరియర్ మొదలైంది. అప్పటికీ, ఇప్పటికీ ఆమె ఎంతో ఎదిగిపోయారు. ఈ సినిమా విషయంలో ఆమెలోని మెచ్యూరిటీ లెవెల్స్ మరింత బలంగా కనిపిస్తున్నాయి" అని అన్నాడు.

"ఈ సినిమా కథా పరంగా .. విజువల్స్ పరంగా .. సాంగ్స్ పరంగా లడ్డూలా ఉంటుంది. ఇక మాళవిక నాయర్ నాకు 'ఎవడే సుబ్రమణ్యం' దగ్గర నుంచి తెలుసు. తను గొప్ప ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. సంతోష్ కి మంచి ఈజ్ .. టైమింగ్ ఉన్నాయి. అతణ్ణి చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తోంది. నందినీ రెడ్డికి మరో నాని దొరికాడు. ఈ సినిమా తప్పకుండా అందరికీ గుర్తుండిపోతుంది" అంటూ చెప్పుకొచ్చాడు. 

Santhosh Sobhan
Malavika Nair
Nandini Reddy

More Telugu News