Nara Lokesh: దివంగత నేత వైఎస్సార్‌కు నివాళి అర్పించిన నారా లోకేశ్.. ఇదిగో వీడియో

nara lokesh tribute to former cm rajasekhar reddy in yuvagalam padayatra
  • నంద్యాల జిల్లా ఆత్మకూరులో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
  • నల్లకాలువ వద్ద వైఎస్ఆర్ స్మృతి వనం మీదుగా వెళ్తున్న సమయంలో అనూహ్య ఘటన
  • చేతులెత్తి నమస్కరించి నివాళులర్పించిన లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లోకేశ్ నివాళులర్పించారు. 

నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి ఈ రోజు పాదయాత్రను లోకేశ్ మొదలు పెట్టారు. ఆత్మకూరు సమీపంలోని నల్లకాలువ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ స్మృతి వనం మీదుగా వెళ్తున్న సమయంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఇతర టీడీపీ నాయకులు వైఎస్సార్ స్మృతి వనం గురించి నారా లోకేశ్ కు వివరించారు.

దీంతో వైఎస్సార్ స్మృతి వనానికి నారా లోకేశ్ నివాళి అర్పించారు. రెండు చేతులెత్తి నమస్కరించారు. తర్వాత అక్కడి నుంచి ముందుకు కదిలారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nara Lokesh
YS rajasekhar reddy
nara lokesh tribute to YSR
Yuva Galam Padayatra

More Telugu News