Prabhas: భద్రాచలం ఆలయానికి ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం.. ‘ఆదిపురుష్’ విజయం సాధించాలని పూజలు

Actor Prabhas Donates Rs 10 Lakhs to Bhadrachalam Temple
  • త్వరలోనే విడుదల కానున్న  ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా
  • ఆలయ ఈవోకు చెక్కు అందించిన ప్రభాస్ ప్రతినిధులు
  • అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల కోసం ఆ మొత్తం కేటాయింపు
టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ. 10 లక్షల విరాళం అందించారు. ఆయన ప్రతినిధులు దంతులూరి సత్యనారాయణరాజు, వేమారెడ్డి, విక్రమ్, శ్రీనివాసరెడ్డి నిన్న ఆలయానికి వచ్చి ఈవో రమాదేవికి చెక్కు అందజేశారు.

శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రం విజయవంతం కావాలని ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీతాయారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ప్రభాస్ విరాళంగా అందించిన రూ. 10 లక్షల మొత్తాన్ని అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల కోసం కేటాయించినట్టు ఏఈవో భవానీ రామకృష్ణారావు తెలిపారు.
Prabhas
Tollywood
Bhadrachalam Temple
Adipurush

More Telugu News