Basavaraj Bommai: బీజేపీ ఓటమి నేపథ్యంలో రాజీనామా సమర్పించిన కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై

  • గవర్నర్ గెహ్లాట్ కు సాయంత్రం రాజీనామాను సమర్పించిన బొమ్మై
  • ఆమోదం పొందినట్లు తెలిపిన బసవరాజు బొమ్మై
  • ఎన్నికల్లో ఓటమికి తనదే బాధ్యత అంటూ ప్రకటన
Basavaraj Bommai resigns as Karnataka CM after BJPs loss in assembly elections

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన నేపథ్యంలో ఆయన శనివారం సాయంత్రం తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు. నేను రాజీనామాను గవర్నర్ కు సమర్పించానని, ఇది ఆమోదం పొందిందని బొమ్మై తెలిపారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కు అందించారు.

కాగా, అంతకుముందు ఫలితాలపై బొమ్మై మాట్లాడారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నానని బసవరాజు బొమ్మై చెప్పారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని, 2024 లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతామన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం పోరాడుదామన్నారు. కాంగ్రెస్ వ్యూహాలను చేధించడంలో తాము విఫలమయ్యామన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని, ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓటమిని విశ్లేషించుకోవాల్సి ఉందన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తామేంటో నిరూపించుకుంటామన్నారు.

More Telugu News