Karnataka: ఇది వేడుక సమయమే కానీ అలసత్వం వద్దు: శశిథరూర్

Time for celebration not for complacency Tharoor on Karnataka polls
  • కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించిన శశిథరూర్
  • కర్ణాటకలో పార్టీ శ్రేణుల పనితీరు చూస్తే గర్వంగా ఉందని వ్యాఖ్య
  • క్షేత్రస్థాయిలో అద్భుత పనితీరు కనబరిచారంటూ ప్రశంస  
కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘కర్ణాటకలో పార్టీ శ్రేణులను చూసి గర్వపడుతున్నాను. క్షేత్రస్థాయిలో వారు అద్భుత పనితీరు కనబరిచారు. స్థానిక సమస్యలపై స్పందిస్తూ, ప్రజల్లో చీలికలు తెచ్చే రాజకీయాలను నిబద్ధతతో దీటుగా ఎదుర్కొన్నారు. ఇది వేడుక చేసుకోవాల్సిన సమయమే. కానీ అలసత్వం కూడదు. మనం కష్టపడి కోరుకున్న ఫలితాన్ని సాధించాం. ఇక ప్రజలు కోరుకున్న ఫలితాలను అందివ్వాలి’’ అని శశిథరూర్ ట్వీట్ చేశారు.
Karnataka
Shashi Tharoor

More Telugu News