Roja: చంద్రబాబు కాంగ్రెస్ ను వదిలేశారు... అందుకే కర్ణాటకలో గెలిచింది: రోజా

Roja comments on Karnataka election results
  • కర్ణాటకలో కాంగ్రెస్ జయభేరి
  • 136 స్థానాలు కైవసం చేసుకున్న హస్తం పార్టీ
  • మోదీతో కలిసి పనిచేయాలనుందని చంద్రబాబు అన్నారన్న రోజా
  • అందుకే బీజేపీ ఓడిపోయిందని వ్యాఖ్యలు
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాలతో విజయభేరి మోగించడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు కాంగ్రెస్ ను వదిలేశారని, అందుకే ఆ పార్టీ కర్ణాటకలో గెలిచిందని ఎద్దేవా చేశారు. "మొన్ననే చంద్రబాబు... మోదీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను అన్నారు... అంతే... ఢమాల్... బీజేపీ పడిపోయింది" అని రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. బాబు గారితో కలిస్తే ఓటమి... విడిపోతే విజయం అని పేర్కొన్నారు. ఇదే రాజకీయ సూత్రం అని రోజా వివరించారు.
Roja
Chandrababu
Congress
Karnataka
Assembly Elections

More Telugu News