congress legislative party: ప్రభుత్వ ఏర్పాట్లలో కాంగ్రెస్.. రేపు కర్ణాటక సీఎల్పీ మీటింగ్!

  • కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రేపు బెంగళూరులో సీఎల్పీ భేటీ
  • తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
  • ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ తర్వాత గవర్నర్‌ వద్దకు
congress legislative party meeting called tomorrow morning in bengaluru

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఏర్పాట్లు మొదలుపెట్టింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రేపు బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశం కానుంది.

ఈ సమావేశంలో కాంగ్రెస్‌ కొత్త ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. తర్వాత తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌కు వినతి పత్రం అందజేయనున్నారు.

ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో 62 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మరో 73 సీట్లలో లీడింగ్ లో ఉంది. అంటే మొత్తం 135 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 113 కాగా, అంతకంటే 20 పైగా సీట్లను గెలుచుకుంది.

More Telugu News