Rahul Gandhi: ఇది బలవంతులపై బలహీనుల విజయం: రాహుల్ గాంధీ

Poor people defeated capitalists in Karnataka says Rahul Gandhi
  • ఘన విజయం అందించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన రాహుల్
  • ద్వేషంతో కాకుండా ప్రేమతో ఎన్నికలను ఎదుర్కొన్నామని వ్యాఖ్య
  • మేనిఫెస్టోలోని 5 హామీలను తొలిరోజే నెరవేరుస్తామని వెల్లడి
కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విజయం బలవంతులపై బలహీనుల గెలుపు అని చెప్పారు. పేదల పక్షాన కాంగ్రెస్ పోరాడిందని తెలిపారు. తాము ద్వేషంతో ఎన్నికలను ఎదుర్కోలేదని... ప్రేమతోనే ఎన్నికలను ఎదుర్కొన్నామని... అదే ప్రేమతోనే కాంగ్రెస్ ను కర్ణాటక ప్రజలు గెలిపించారని అన్నారు. విద్వేష రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో సాధించిన విజయం ప్రతి ఒక్కరిదని చెప్పారు. విజయానికి కృషి చేసిన నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక ఫలితాలే అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన 5 హామీలను తొలిరోజే నెరవేరుస్తామని చెప్పారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు.
Rahul Gandhi
Congress
Karnataka

More Telugu News