ipl: కాసేపట్లో ఉప్పల్‌లో మ్యాచ్.. సన్ రైజర్స్ కు చావోరేవో!

  • నేడు లక్నోతో తలపడనున్న హైదరాబాద్
  • ఇకపై ప్రతీ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉండనున్న రైజర్స్
  • సొంతగడ్డపై ఓడితే అంతే సంగతులు
  SunRisers Hyderabad to take on Lucknow Super Giants home soil

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో పడుతూ లేస్తూ సాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. సొంతగడ్డపై జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ అత్యంత కీలంక కానుంది. హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. రైజర్స్ పది మ్యాచ్ ల్లో నాలుగే గెలిచి ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. రన్ రేట్ కూడా మైనస్ లో ఉంది. 

లక్నో పై భారీ తేడాతో గెలిస్తే పది పాయింట్లతో ఆరో స్థానానికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు లక్నో కాస్త మెరుగైన స్థితిలో ఉంది. 11 మ్యాచ్ ల్లో 11 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. హైదరాబాద్ పై గెలిస్తే 13 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంటుంది. కాబట్టి సన్ రైజర్స్ పైనే ఒత్తిడి ఉండనుంది. పైగా తమ చివరి మూడు మ్యాచ్ లను రైజర్స్ బలమైన గుజరాత్, ఆర్సీబీ, ముంబైతో ఆడనుంది. ఈ నేపథ్యంలో లక్నోపై విజయం హైదరాబాద్ కు అనివార్యమే అనొచ్చు. గత పోరులో రాజస్థాన్ రాయల్స్ పై ఆఖరి బంతికి అద్భుతం చేసిన హైదరాబాద్ ఈ సారి ఏం చేస్తుందో చూడాలి.

More Telugu News