Ileana: బేబీ బంప్ తో ఇలియానా.. ఫొటోలు ఇవిగో

Ileana shares baby bump photos
  • తల్లి కాబోతున్న ఇలియానా
  • గర్భందాల్చిన ఫొటోలను షేర్ చేసిన గోవా బ్యూటీ
  • బిడ్డకు తండ్రి ఎవరో ఇంతవరకు వెల్లడించని వైనం
గోవా బ్యూటీ ఇలియానా గర్భవతి అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకోవైపు ఇలియానా నిజంగానే తల్లి కాబోతోందా? అని ఎంతోమంది అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ అనుమానాలను నివృత్తి చేసేలా తాజాగా ఆమె బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెగ్ గౌన్ లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇలియానా ఏ సినిమా చేయడం లేదు. ఇంట్లోనే ఉంటూ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు, తన బిడ్డకు కాబోయే తండ్రి ఎవరన్నది మాత్రం ఇప్పటికీ ఆమె సీక్రెట్ గానే ఉంచింది. దీంతో, ఆయన ఎవరో అర్థంకాక జనాలు తలలు పట్టుకుంటున్నారు.
Ileana
Baby Bump
Tollywood
Bollywood

More Telugu News