Harish Rao: తనయుడు ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకోవడంతో హరీశ్ రావు ఆనందం

  • కొలరాడో వర్సిటీలో విద్యాభ్యాసం చేసిన అర్చిష్మాన్ తన్నీరు
  • స్నాతకోత్సవానికి హాజరైన మంత్రి హరీశ్ రావు
  • అర్చిష్మాన్ కు డిగ్రీ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్ మెంట్ అవార్డు
  • పొంగిపోతున్న హరీశ్ రావు
Harish Rao feels happy after his son Archishman taken graduation certificate from Colorado University

తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నారు. ఆయన తనయుడు అర్చిష్మాన్ అమెరికాలోని ప్రఖ్యాత కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నాడు. కొలరాడో వర్సిటీ స్నాతకోత్సవం అమెరికాలోని బౌల్డర్ లో జరగ్గా, హరీశ్ రావు కూడా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో అర్చిష్మాన్ గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్ మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. దాంతో హరీశ్ రావు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ విషయాన్ని హరీశ్ రావు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

"మా అబ్బాయి సాధించిన అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉండగలను? ఇది అతడి పట్టుదలకు, మార్పు తీసుకురావాలన్న ఆకాంక్షకు నిదర్శనం. ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి మా వాడు అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు. అచ్చూ... ఈ అమోఘమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా నీకు నా అభినందనలు" అంటూ తనయుడిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News