Pawan Kalyan: ప్రతి ఎన్నికల్లోనూ ఏదో జెండాను మోయడమే పవన్ కల్యాణ్ పని: గుడివాడ అమర్నాథ్ విమర్శలు

Minister Amarnath Reddy lashes out at pawan kalyan
  • కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టాలని చూస్తున్నారన్న మంత్రి అమర్నాథ్ 
  • పార్టీని నడపలేనని పవన్ చేతులెత్తేశారని ఎద్దేవా   
  • అది జనసేన కాదు.. జెండా సేన అన్న అమర్నాథ్
ప్రతి ఎన్నికల్లోనూ ఏదో జెండాను మోయడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పని అని మంత్రి అమర్నాథ్ విమర్శించారు. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుతో ఏం డీల్ కుదిరిందో జనసేనాని చెప్పాలని నిలదీశారు. టీడీపీ అధినేతకు ఆయన అమ్ముడుపోయారన్నారు. 

పార్టీని నడపలేనని పవన్ చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. అది జనసేన కాదని, జెండా సేన అన్నారు. అందుకే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ జెండాను మోస్తుందన్నారు.
Pawan Kalyan
Janasena

More Telugu News